NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం జరిగిన బీఈడీ రెండో, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 1,145 మంది విద్యార్థులకు గాను 1,088 మంది హాజరయ్యారని, 57 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు.