GDWL: ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది. బుధవారం ప్రాజెక్టులోకి 45,000 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు 47,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని, ప్రాజెక్టులో ప్రస్తుతం 8.898 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.