SKLM: టెక్కలి మండలం కొండ భీంపురం గ్రామంలో నారీ శక్తి అవగాహనా కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. టెక్కలి ఎస్సై-2 రఘునాధరావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మహిళా చట్టాలు, బాల్య వివాహాలు మొదలగు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. 112 టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగాలు, పనిచేయు విధానాన్ని గ్రామ ప్రజలకు వివరిస్తూ డెమో రూపంలో వివరించారు.