ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అయితే దీని తర్వాత చరణ్ ప్రాజెక్ట్ ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉండగానే.. ఆచార్యతో పాటు ఆర్సీ 15ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. అలాగే ఆర్సీ16ని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననురితో ఫిక్స్ చేశాడు.
నిన్న మొన్నటి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే వినిపించింది. అయితే ఫైనల్ నరేషన్లో చరణ్‌ను మెప్పించలేకపోయాడట గౌతమ్. దాంతో చరణ్ ఈ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో చరణ్ నెక్ట్స్ డైరెక్టర్‌గా రోజుకో పేరు తెరపైకి వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మల్లిడి వశిష్టి కూడా చేరిపోయాడు. ఫస్ట్ మూవీ బింబిసారతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు కాబట్టి..
ప్రస్తుతం బింబిసార 2 స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టేందుకు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యే సూపర్ స్టార్ రజనీకాంత్‌కి కూడా ఓ కథ చెప్పాడని టాక్. ఇక ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ని కూడా లైన్లో పెట్టాడట.. ఇటీవల వశిష్టతో చరణ్ కథా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చరణ్‌కు ‘బింబిసార’లాగే ఓ సోషియో ఫాంటసీ కథ చెప్పినట్టు సమాచారం. చరణ్‌కి కూడా ఆ కథ బాగా నచ్చిందని తెలుస్తోంది.
అన్నీ కుదిరితే ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అయ్యే ఛాన్సు ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఇప్పటికే చరణ్‌తో సుకుమార్ కూడా లైన్లో ఉన్నాడు. దాంతో చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.