ELR: అన్నదాతలను అవమానించి, కష్టాలపాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిది అని నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం అమరావతి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని మండిపడ్డారు. అన్ని విధాల చేసి ఇప్పుడు ముసల కన్నీరు కారుస్తున్నారని అన్నారు.