ఏప్రిల్ 15వ తేది నుంచి జూన్ 14వ తేది వరకూ కూడా ఏపీలో చేపల వేట(Fishing)పై నిషేధం ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం అనేది యాంత్రిక, మోటారు బోట్లకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. 61 రోజుల పాటు వీరంతా చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశించింది.
ఏపీ(AP)లో 61 రోజుల పాటు చేపల వేట(Fishing)పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. చేపల(Fish) ప్రత్యుత్పత్తి, గుడ్లు పెట్టే సమయం కావడంతో సముద్రంలో చేపల వేట(Fishing)పై నిషేధం విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఓ ప్రకటన జారీ చేసింది.
ఏప్రిల్ 15వ తేది నుంచి జూన్ 14వ తేది వరకూ కూడా ఏపీలో చేపల వేట(Fishing)పై నిషేధం ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం అనేది యాంత్రిక, మోటారు బోట్లకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. 61 రోజుల పాటు వీరంతా చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశించింది.
వేసవికాలం అనేక రకాల చేపలు, రొయ్యలకు సంతానోత్పత్తి సమయం అని అందుకే వేట(Fishing)ను నిషేధం విధించినట్లు ఏపీ సర్కార్ వివరించింది. తల్లి చేపలు, రొయ్యలు మత్స్యకారుల(Fishermen) వలలకు చిక్కుకోకుండా కాపాడేందుకు ఈ నిషేధాన్ని విధించినట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
ఒకవేళ ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మత్స్యకారులు(Fishermen) చేపలు పడితే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. చట్ట ప్రకారంగా అటువంటివారు శిక్షార్హులవుతారని వెల్లడించారు. బోట్లను, వారు పట్టిన చేపలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, జరిమానా కూడా విధిస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారికి ప్రభుత్వం అందించే రాయితీలు, సదుపాయాలు నిలిచిపోతాయని తెలిపారు.