BDK: ఇల్లందు మాజీ మున్సిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు చౌదరి మరియు ఇల్లందు ప్రముఖ కాంట్రాక్టర్ గడ పర్తి శ్రీనివాస్ చౌదరి మధ్య శుక్రవారం ఖమ్మంలో ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు. రాత్రి మనోవేదన గురి అయ్యి కారేపల్లి మండలం మోట్లగూడెం గ్రామంలో గడపర్తి శీను శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.