KNR: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన గురునాథం వంశీ (10వ తరగతి), ఎం. కార్తికేయ (9వ తరగతి) ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 2, 3 తేదీల్లో ఒంగోలు నవోదయ విద్యాలయంలో నిర్వహించిన రీజనల్ లెవెల్ కళా ఉత్సవ్–2025లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు. వారి విజయంపై ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి అభినందనలు తెలిపారు.