GNTR: వట్టిచెరుకూరు నుంచి ముట్లూరు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించడం వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందిగా తయారైందని తెలిపారు. రాత్రిపూట ప్రయాణించాలంటే భయంగా ఉందని, ఈ సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.