GNTR: తెనాలి-గుంటూరు మార్గంలోని గరువుపాలెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తెనాలి నుంచి నారాకోడూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, తెనాలి వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.