CTR: పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పరిధిలో శనివారం వేకువజామున ఏనుగుల గుంపు పంటలపై దాడి చేశాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాతపాలెం అడవి నుంచి గ్రామ సమీపానికి చేరుకున్న ఏనుగుల గుంపు రైతులు సురేష్, శంకర్‌కు చెందిన కొబ్బరి, మామిడి, పశుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.