NLR: మనుబోలులోని చెర్లోపల్లి గేటు వద్ద ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలోని వినాయక స్వామి లడ్డుకు వేలంపాట శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ వేలం పాటలో 4.03 లక్షలకు రికార్డు స్థాయికి లడ్డు ధర పలికింది. గుండు బోయిన వెంకటేశ్వర్లు ఈ లడ్డును దక్కించుకున్నారు. అనంతరం వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.