మేఘాలయలో హనీమూన్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో రాజా రఘువంశీని హత్య చేసింది అతడి భార్య సోనమ్ అని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో ఆమెతో పాటు సోనమ్ ప్రియుడు, మరో ముగ్గురిపై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో మొత్తం 790 పేజీల ఛార్జ్ షీట్‌ను తయారు చేశారు.