SKLM: అటవీ శాఖలో పలు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డీఆర్వో వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని వివరించారు. జిల్లాలో 10 కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలలో 5156 మంది పరీక్ష రాస్తున్నారన్నారు.