TG: వినాయక నిమజ్జనం వెనుక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ నిమజ్జనం అనేది జనన, జీవిత, మరణ చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల ఇంట్లోని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం అనంత చతుర్దశి రోజున గణపతి.. తన తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడట. అందుకే ఈ రోజునే గణనాథుడిని నిమజ్జనం చేస్తారు.