GNTR: రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న తల్లి, కొడుకును శుక్రవారం నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ DSP అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. కన్నావారి తోటలో రూ.4.50 కోట్ల విలువైన ఆస్థికి తల్లి ప్రసన్న లక్ష్మీ, కొడుకు జయకృష్ణ నకిలీ పత్రాలు సృష్టించి 2015లో ఓ వ్యక్తికి విక్రయించారు. మొత్తం 8 కేసులు వారిపై ఉన్నాయని చెప్పారు.