భారత్తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు దేశాల మధ్య విభేదాలు వస్తాయని, తాను ఎప్పుడూ ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటానని చెప్పారు. మోదీని గొప్ప ప్రధానిగా అభివర్ణించిన ట్రంప్, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నచ్చలేదని వ్యాఖ్యానించారు.