»Dalai Lama Apologises To Boy And His Family After Viral Suck His Tongue Video
Suck his Tongue బాలుడితో అనుచిత ప్రవర్తనపై బౌద్ధ గురువు Dalai Lama క్షమాపణలు
దలైలామా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాడు. తదుపరి బౌద్ధ గురువు మహిళ అయితే ‘ఆమె చాలా అందగత్తె అయ్యి ఉండాలి’ అని పేర్కొని వివాదాస్పదమయ్యాడు. గతంలో కూడా కొందరితో బాలుడితో ప్రవర్తించినట్టు అసభ్యంగా చేశారు.
బాలుడితో అనుచిత ప్రవర్తన ఘటనలో బౌద్ధ (Bhuddism) మత 14వ గురువు దలైలామా (Dalai Lama) క్షమాపణలు చెప్పారు. తన నాలుకను నోటితో తాకాలంటూ (Suck his Tongue) ఓ బాలుడిని కోరిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర దుమారం రేపింది. అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ సంఘటనపై విచారం (Apologise) వ్యక్తం చేశారు. ‘తనను కలిసేందుకు వచ్చే వారితో దలైలామా సరదాగా వ్యవహరిస్తారు. అదే క్రమంలో బాలుడితో అలా ప్రవర్తించారు’ అని దలైలామా బృందం స్పందించింది.
‘దలైలామా తనను కలుసుకునే వ్యక్తులతో ఉల్లాసంగా గడిపి, ఆట పట్టిస్తుంటారు. తన ప్రవర్తనతో బాలుడిని బాధించినందుకు, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని కోరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది స్నేహితులకు ఈ విషయం చెప్పాలని భావించారు. బహిరంగంగా.. కెమెరాల ముందు కూడా అమాయకంగా, సరదాగా కలుసుకునే వ్యక్తులను ఆట పట్టిస్తుంటారు. అలాగే ఆ బాలుడితో ప్రవర్తించారు. ఈ సంఘటనపై దలైలామా విచారం వ్యక్తం చేశారు’ అని దలైలామా బృందం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా దలైలామా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాడు. తదుపరి బౌద్ధ గురువు మహిళ అయితే ‘ఆమె చాలా అందగత్తె అయ్యి ఉండాలి’ అని పేర్కొని వివాదాస్పదమయ్యాడు. గతంలో కూడా కొందరితో బాలుడితో ప్రవర్తించినట్టు అసభ్యంగా చేశారు. కాగా దలైలామా తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వెంటనే బౌద్ధ మత గురువు స్థానం నుంచి ఆయన దిగిపోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.