కృష్ణా: సమాజ సేవాభిలాష గొప్ప అలవాటు అని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఇవాళ మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, మొవ్వ మండల పార్టీ అధ్యక్షుడు లింగమనేని రామలింగేశ్వర రావు నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి ట్యాంకర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఏఎంసీ ఛైర్మన్ జన్ను శోభన్ బాబు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.