PPM: పాచిపెంటలో సోమవారం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించనున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పాచిపెంట గ్రామంలో పర్యటించి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయాలని మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గుడెపు యుగంధర్ కోరారు.