GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆదివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షన, డ్రైనేజ్ కాలువల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణ, లోతట్టు ప్రాంతాల గుర్తింపు, దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.