NRPT: సెప్టంబర్ 13న నారాయణపేట జిల్లా కోర్టుల్లో జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అధికారులు కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం నారాయణపేట కోర్టు సమావేశం మందిరంలో పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులతో లోక్ అదాలత్ నిర్వహణపై కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.