GNTR: ప్రత్తిపాడుకి చెందిన సత్యనారాయణ (42) నష్టాల్లో కౌలు రైతుగా వ్యవసాయం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆ కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల ఆర్థికసహాయం ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బందులు పడ్డారని, కూటమి పాలనలో రైతులకు మేలు జరుగుతుందన్నారు.