NZB: నవీపేట్ మండలంలోని నందిగాం శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శనివారం పెద్ద బండ రాయిపై చిరుతను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత కొద్ది రోజులుగా పంట పొలాలు, అటవీ ప్రాంతాల్లో చిరుత దర్శనమిచ్చే పరిస్థితితో రైతులు, గొర్రెల పెంపకదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.