కృష్ణా: ‘మేరా యువ భారత్ మై భారత్’ ఆధ్వర్యంలో విజయ కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని శనివారం మచిలీపట్నం పద్మావతి మహిళా కళాశాల నందు ఘనంగా నిర్వహించారు. మాజీ ఆర్మీ మేజర్ సుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, నగర డీఎస్పీ రాజా పాల్గొన్నారు. మొదటిగా ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.