సరిహద్దు వివాదం నేపథ్యంలో థాయ్లాండ్, కంబోడియా దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంబోడియాలో నివసిస్తున్న తమ ప్రజల కోసం భారత రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని హెచ్చరించింది. ఏదైనా అత్యవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.