KDP: పోరుమామిళ్ల మండలంలోని మద్దిమాను గుర్రప్ప స్వామి ఆలయం ఈవో నరసయ్య, ఇన్స్పెక్టర్ జనార్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ. 6,16,387 నగదు, 180 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి లభించాయన్నారు. ఆలయంలో భక్తులకు అవసరమైన వసతులను కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రప్పగారిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.