E.G: కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని MRPS రాష్ట్రవ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ అన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కొవ్వూరు మండలం పశివేదలలో రాష్ట్ర SC కమిషన్ ఛైర్మన్ జవహర్ ఫ్లెక్సీను కొంతమంది వ్యక్తులు చించేసారన్నారు. దీనికి కారణమైన పెండ్యాల అచ్చిబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు.