SRPT: ప్రతిభ కలిగిన విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు బాబు అన్నారు. శనివారం కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అధిక మార్కులు పొంది బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించిన రేఖ, నరేందర్‌కు రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ చేతుల మీదుగా అందజేశారు.