GNTR: విద్యార్థి దశ నుండే భయాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే దాన్ని మించిన ఆయుధం లేదని హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి అన్నారు. ఓటమి శత్రువుల వల్ల రాదని, మనసులో ఉండే భయం వలన వస్తుందని చెప్పారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.