KRNL: రోడ్లపై గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ ఆదోని మండలం పెద్దహరివాణంలో వైసీపీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రహదారిపై గుంతల్లో వరి నాట్లు వేశారు. ఆదోని – శిరుగుప్ప, పెద్దహరివాణం -హెబ్బటం మార్గాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 నెలలుగా కూటమి ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదని మండిపడ్డారు.