సమంత(Samantha) మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత వ్యాధిపై సోషల్ మీడియాలో ఆమె పై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అలవాట్ల వల్ల సామ్ మయోసైటిస్ బారిన పడిందని చర్చించుకుంటున్నారు జనాలు. అలాగే నాగ చైతన్య-సమంత కలిశారనే ప్రచారం జరుగుతునే ఉంది. అయితే అభిమానులతో పాటు చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు.. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మొత్తంగా ఇప్పటి వరకు సమంతను బ్యాడ్ కామెంట్స్ చేసిన వారు.. ఇప్పుడు ఆమెపై జాలి చూపిస్తున్నారు. ఇక సామ్ లేటెస్ట్ ఫిల్మ్ యశోద(Yashoda) పై తెగ సంపథి ఏర్పడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘యశోద’ నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ వచ్చినట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. మిగతా నటీ నటులు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు.
ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గోంటొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. సామ్ యశోద ప్రమోషన్స్‌లో పాల్గొంటుందా.. లేదంటే ప్రమోషన్స్ కోసం ఏం చేయబోతోందనేది.. ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సమంత కొన్ని మెయిన్ ఈవెంట్స్‌కు మాత్రమే హాజరు కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సెడ్యూల్ రెడీ అవుతున్నట్టు టాక్.