ASR: డుంబ్రిగుడ మండలంలోని లైగెండ పంచాయతీలో టీడీపీ కమిటీ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల పరిశీలకులు రాము, లోకేష్ ఆధ్వర్యంలో కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా సత్యారావు, ఉపాధ్యక్షులుగా మహదేవ్, ప్రధాన కార్యదర్శిగా గొల్లూరి చంద్రదాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఎన్నికైన సభ్యుల తెలిపారు.