SRD: ప్రభుత్వ నిధులతో వట్పల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ, లోకల్ పాఠశాలలకు వంట పాత్రలు మంజూరైనట్లు వట్పల్లి మండల విద్యాధికారి గోవింద్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని రకాల పాఠశాలలకు వీటిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు 2 నుంచి 4 పాత్రలు ఇచ్చామన్నారు.