MHBD: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ మాలోత్ కవిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. BRS పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశంలో మాజీమంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పాల్గొంటారన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.