MBNR: పురపాలక పరిధిలోని 19వ వార్డు తాండ ప్రాంతంలో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను మాజీ మున్సిపల్ చైర్మన్ షబ్బీర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.