BPT: మాజీ సీఎం జగన్ పర్యటనలో దాడికి గురైన ఓ ప్రముఖ దినపత్రిక ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను అద్దంకి ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం పరామర్శించారు. శివ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శివ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.