JGL: జగిత్యాల వైశ్యభవన్లో ఓ షాప్లో నకిలీ పైపులు విక్రయిస్తున్నారని ఆందోళన నిర్వహించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అవసరమైన ప్లంబింగ్ సామాగ్రిని ఒక వినియోగదారుడు కొనుగోలు చేశారు. అందులో కొన్ని పైపులు నాసిరకంగా ఉన్నట్లు బాధితుడు వాపోయారు. దీనిపై షాపు యాజమానిని నిలదీయగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని బాధితుడు తెలిపాడు.