KRNL: నగరంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, 5వ శానిటేషన్ డివిజన్ కార్యాలయం, గడియారం ఆసుపత్రి, పాతతుంగభద్ర పంప్ హౌస్, వాహనాల మరమ్మత్తుల షెడ్, గార్గేయపురం డంప్ యార్డులో బయోమైనింగ్, శునకాల సంతాన కేంద్రాన్ని పరిశీలించారు.