KMM: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల ప్రధాన సమస్య పోడు భూములపై నాలుగు దశాబ్దాల పాటు పోరాటాలు చేసిన యోధుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అని CPI ML మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అన్నారు. శనివారం ఖమ్మంలో కామ్రేడ్ చంద్రశేఖర్ వర్ధంతి సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 16న నిర్వహించే కామ్రేడ్ చంద్రశేఖర్ వర్ధంతి సభను జయప్రదం చేయాలని పేర్కొన్నారు.