W.G: విద్యా, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ గోపి మూర్తి మండిపడ్డారు. శనివారం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పాలకుల విధానాలను తిప్పి కొట్టాలని, ఈ రెండు రంగాలను ప్రభుత్వ రంగం నుంచి వేరు చేయొద్దని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.