NDL: బనగానపల్లె మండలం కైప గ్రామానికి చెందిన మధుప్రియ(7) శుక్రవారం సాయంత్రం వీధిలో ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు.