సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణ 19వ వార్డులో “సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు, ఉపాధి అవకాశాలు, బీసీ/ఎస్సీ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారని పరిటాల శ్రీరామ్ తెలిపారు.