మేడ్చల్: మేడిపల్లిలో నివాసం ఉంటున్న మహేశ్ భార్య లక్ష్మీకి శనివారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఉప్పల్ 108 సిబ్బంది హుటాహుటిన మేడిపల్లికి వెళ్లి ఆమెను తీసుకొని గాంధీ హాస్పిటల్‌కి బయలుదేరారు. మార్గమధ్యంలో ఆమెకి పురిటి నొప్పులు అధికం కావడంతో సిబ్బంది డెలివరీ చేశారు. అనంతరం ఉప్పల్ ప్రాథమిక కేంద్రానికి తరలించారు.