ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అత్రం సుగుణ అన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.