ఎన్టీఆర్: బెంగళూరు నుంచి విజయవాడకు కొకైన్ తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడలో ముగ్గురిని అదుపులోకీ తీసుకున్నారు. గత రాత్రి విజయవాడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులు కౌశిక్, ఆకాశ్, వీర వెంకట రాఘవలను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నామని చెప్పారు.