AKP: ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు రైల్వేస్టేషన్లో ఎస్సై ఈశ్వరరావు నిర్వహించిన తనిఖీలో వీరు పట్టుబడ్డారు. మహారాష్ట్రకు చెందిన విశాల్, సర్వగీత్ సింగ్తో పాటు మరొకరు ఏజెన్సీలో 12 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు.