BDK: ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతుండటంతో పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 100 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, శనివారం ఉదయం నీటిమట్టం 399.30 అడుగులకు పెరిగినట్లు ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు.