కర్ణాటక సీఎంను కలవడానికి నిరాకరించి రాహుల్ గాంధీ ఆయన్ని అవమానించారని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఈ వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ఢిల్లీలో తన ప్రాథమిక ఉద్దేశ్యం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో మైసూరు దసరా ఎయిర్ షో గురించి చర్చించడమేనని ఆయన స్పష్టం చేశారు. రాహుల్కు కర్ణాటక ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు.