మేడ్చల్: జిల్లా కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలోని సమస్యాత్మకమైన, మరమ్మతులు అవసరమైన రోడ్ల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అదనపు కలెక్టర్ తెలుసుకున్నారు. సమస్యలను ఎంత వరకు పరిష్కరించారు..? పెండింగ్ వివరాలను అధికారులను అడిగి వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.